బోల్డ్ రోల్‌తో ఆడియెన్స్ ను మెప్పిస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈషా రెబ్బా.. వెండితెరపై రాణించాలని ఆరాటపడుతున్న తెలుగు హీరోయిన్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవిందసమేత వీర రాఘవ వంటి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు, చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ తనకంటూ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తుందీ అమ్మడు. తాజాగా ఈమె ఓ బోల్డ్ డిసిషన్ ఈమెకు మరింత గుర్తింపు తెస్తుందో లేదో చూడాలి. ఇంతకు ఈషా రెబ్బా ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా? వెబ్ సిరీస్‌లో నటించడానికి. చాలా మంది స్టార్స్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో నటిస్తున్నారు కదా అనే అనుమానం రావచ్చు.
అయితే ఈషా రెబ్బా నటిస్తున్న కంటెంట్ బోల్డ్ కంటెంట్. హిందీలో లస్ట్ స్టోరీస్ తరహా కంటెంట్‌తో తెలుగులో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. లస్ట్స్టోరీస్లో భర్త నుండి సంతృప్తి పొందని భార్య పాత్రలో కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో అలాంటి గృహిణి పాత్రలో ఈషా రెబ్బా నటించిందని వార్తలు వినపడుతున్నాయి. రోనీ స్క్రూనీవాలా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను నలుగురు దర్శకులు నాలుగు భాగాలుగా చిత్రీకరించనున్నారట. అందులో ఓ భాగాన్ని ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. ఇందులో ఈషా రెబ్బా నటించిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com