ఏపీలో బదిలీ అధికారుల స్థానంలో ఈసీ కొత్త నియామకాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజగా వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రాత్రి 8గంటల లోపు ఛార్జ్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కొత్త కలెక్టర్లు వీరే..
కృష్ణా జిల్లా కలెక్టర్ - డి.కె.బాలాజీ
అనంతపురం కలెక్టర్ - వి.వినోద్‌కుమార్
తిరుపతి కలెక్టర్ - ప్రవీణ్‌కుమార్
కొత్త ఎస్పీలు వీరే..
గుంటూరు ఐజీ - సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ప్రకాశం జిల్లా ఎస్పీ - సుమిత్ సునీల్
పల్నాడు జిల్లా ఎస్పీ- బిందు మాధవ్
చిత్తూరు ఎస్పీ - మణికంఠ చందోలు
అనంతపురం ఎస్పీ- అమిత్ బర్దార్
నెల్లూరు ఎస్పీ- ఆరిఫ్ హఫీజ్
కాగా వైసీపీ నేతలకు అనుకూలంగా.. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులతో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారుల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. అలాగే ఐఏస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం ఎన్నికల అధికారి గిరీజా, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషాలను కూడా బదిలీ చేసింది. వీరికి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు విధులు అప్పగించకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments