సెక్స్ కి కూడా వెనకాడరా.. ఎంత ఘోరం, ఫ్యామిలీ మ్యాన్ 2పై భగ్గుమంటూ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఇక్కడ తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే..తమిళుల్లో ఐక్యత మరోసారి బయటపడింది. జల్లికట్టు విషయంలో ఆల్రెడీ ప్రూవ్ అయింది.
ఇదీ చదవండి: బికినీలో 'పెళ్లిసందడి' హీరోయిన్ ఎక్స్ పోజింగ్.. 53 ఏళ్ల వయసులో ఇలా..
ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. జూన్ 4న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కూడా అయింది. అద్భుతమైన స్పందన దక్కించుకున్నది. ఈ వెబ్ సిరీస్ లో తమిళులని టెర్రరిస్టులుగా, రెబల్స్ గా, క్రిమినల్స్ గా చిత్రీకరించారని వివాదం చెలరేగింది. ముఖ్యంగా సమంత పాత్రపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ముఖ్యంగా శ్రీలంకలోని ఈలం తమిళుల గురించి తప్పుగా చూపించారని అగ్రహాలు వ్యక్తం అయ్యాయి. ఈ వెబ్ సిరీస్ విడుదలై 20 రోజులు గడుస్తున్నా ఇంకా వివాదం ఆగలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ కమ్యూనిటీ మొత్తం ఫ్యామిలీ మ్యాన్ 2 పై గుర్రుగా ఉన్నారు.
ఇటీవల లండన్ లో అమెజాన్ ప్రైమ్ ఆఫీస్ ముందు తమిళులు ధర్నా కూడా నిర్వహించారు. ఈలం తమిళులు టెర్రరిస్టులు కాదు.. భాదితులు అంటూ ఆందోళన చేపట్టారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు ఐక్యంగా మారి ఫ్యామిలీ మ్యాన్ 2, ప్రైమ్ వీడియోకి వ్యతిరేకంగా ప్రకటన విడుదల చేశారు.
ఈలం తమిళుల తరుపున ఈ ప్రకటన విడుదల చేయబడింది. ఈ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద మారణహోమంలో మేము భాదితులం. మాపై జరిగిన మారణహోమానికి తెలిపిన నిరసనని వక్రీకరించి మమ్మల్ని ఈ వెబ్ సిరీస్ లో తప్పుగా చూపించారు.
దీనికి నిరసనగా కోవిడ్ పరిస్థితుల్లో కూడా తాము ప్రైమ్ వీడియో ఆఫీస్ ముందు ధర్నా చేశాం. అమెజాన్ ఆఫీస్ ముందు ఇలాంటి ధర్నా జరగడం ఇదే తొలిసారి. మా తమిళ సోదరులని ఉపయోగించుకు మాపైనే అసత్యాలు ఈ వెబ్ సిరీస్ లో ప్రచారం చేశారు. మా తమిళ నటులు, రైటర్స్ ఈ సిరీస్ లో భాగం కావడం చాలా బాధించింది.
ఇది ఫిక్షనల్ కథ అని ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ సాకులు చెబుతున్నారు. కానీ ఇందులో ఉపయోగించిన పదాలు, డైలాగులు తమని తప్పుగా చూపించే విధంగా ఉన్నాయి. మా మనసుకు ఎంతో భాద కలిగించాయి. ఈలం తమిళులని తప్పుగా చూపించినట్లు సుస్పష్టంగా అర్థం అవుతోంది.
మరీ ఘోరమైన విషయం ఏమిటంటే.. ఈలం తమిళ మహిళలను కూడా పూర్తి అసత్యాలతో చూపించారు. ఈలం తమిళ మహిళల క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ.. తమ లక్ష్యం చేరుకోవడానికి సెక్స్ కి కూడా వెనుకాడరు అన్నట్లుగా ఈ సిరీస్ లో చూపించారు.
సత్యాలని పూర్తిగా పక్కన పెట్టి ఈ సిరిస్ తెరకెక్కించినట్లు ఉంది. మమ్మల్ని టెర్రరిస్టులు చూపించారు. మాపై జరిగిన మారణహోమం కి వ్యతిరేకంగా మేము గత 12 ఏళ్లుగా అంతర్జాతీయ న్యాయ నిబంధనలను అనుసరించి శాంతి యుతంగా పోరాడుతున్నామని అన్నారు.
ఇలాంటి అసత్యాలత కూడిన సిరీస్ లు మా పోరాటాన్ని నీరుగార్చే విధంగా ఉన్నాయి. ఇకపై ఇలాంటి చిత్రాల్లో తమిళ ఆర్టిస్టులు, రచయితలు, దర్శకులు భాగం కాకూడదని కోరుతున్నాం అని ఈలం తమిళులు లేఖలో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments