బుల్లితెర పై 'ఈగ'
Send us your feedback to audioarticles@vaarta.com
అపజయమెరుగని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు `బాహుబలి-2`తో ఇండియా టాప్ డైరెక్టర్ అయ్యాడు. బాహుబలి చిత్రాన్ని విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కించడంతో రాజమౌళికి విఎఫెక్స్లో ఉన్న గ్రిప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజమౌళికి విఎఫెక్స్ పరంగా ప్రపంచ వ్యాప్తమైన గుర్తింపు తెచ్చిన చిత్రం `ఈగ`.
చిన్న కీటకమైన ఈగ ప్రతికారం ఎలా తీర్చుకుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. సుదీప్ విలన్‌గా నటించాడు. ఈగకు రాజమౌళి సీక్వెల్ చేస్తాడని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఆ దాఖలాలు కనపడలేదు. అయితే ఈగ చిత్రాన్ని బుల్లితెరపై ఆవిష్కరింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అది కూడా హిందీలోనేనని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com