సెప్టెంబర్ 25న 'ఈడు గోల్డ్ ఎహే' థియేట్రికల్ ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలను నాలుగు పట్టణాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా...
నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ - ''ఈడు గోల్డ్ ఎహే చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మణిశర్మ తనయుడు సాగర్ ఎం. శర్మ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ని అందించారు. ఈ చిత్రంలోని పాటలను నాలుగు పట్టణాల్లో విభిన్నంగా విడుదల చేశాం. మొదటి పాటను సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో, రెండో పాటను 22న వైజాగ్‌లో, మూడో పాటను 23న రాజమండ్రిలో, నాలుగో పాటను సెప్టెంబర్ 24న విజయవాడలో రిలీజ్ చేశాం. ప్రతి పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే థియేట్రికల్ ట్రైలర్ ను రేపు (సెప్టెంబర్ 25)సాయంత్రం ఎన్ టీవీలో జరిగే లైవ్ ప్రోగ్రాం ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంటుంది. అలాగే సినిమాను అక్టోబర్ 7న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
స్టార్ సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్ ఇస్సార్, డా.నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రభాస్, భరత్, అనంత్, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్ అక్షిత్, నల్లవేణు, గిరిధర్, సుదర్శన్, విజయ్, జోష్ రవి, పి.డి.రాజు, పవన్, గణేష్, కోటేశ్వరరావు, జగన్, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్, సంగీతం: సాగర్ ఎం. శర్మ, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఫైట్స్: గణేష్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments