'ఈడు గోల్డ్ ఎహే' ఓవర్ సీస్ హక్కులు...

  • IndiaGlitz, [Thursday,September 22 2016]

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన యు.ఎస్., కెనడా ఓవర్ సీస్ హక్కులను సినీ ప్యారడైజ్ సంస్థ దక్కించుకుంది. అక్టోబర్ 6న ప్రీమియర్ షో ను కూడా యు.ఎస్, కెనడాల్లో ప్రదర్శించనున్నారు. రిచా పనయ్, సుష్మా రాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.