ఈరోజే ఈడు గోల్డ్ ఎహే గోల్డ్ టూర్ ప్రారంభం
Wednesday, September 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే. ఎ టీవి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు నుంచి ఈడు గోల్డ్ ఎహే టీమ్ గోల్డ్ టూర్ ను ప్రారంభిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ఈరోజు సాయంత్రం 6.30 నిమిషాలకు హైదరాబాద్ లోని టీ.వి 9 స్టూడియోలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. రేపు (22)న వైజాగ్ జగదాంబ ధియేటర్ లో రాత్రి 7 గంటలకు రెండో పాటను రిలీజ్ చేయనున్నారు.
23న రాజమండ్రి అశోక్ థియేటర్ లో రాత్రి 7 గంటలకు మూడో పాటను, 24న విజయవాడ ఉషా రామ ఇంజనీరింగ్ కాలేజ్ 2.30 నిమిషాలకు నాలుగవ పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించారు. ఈ చిత్రంలో సునీల్ సరసన రిచా పనయ్, సుష్మారాజ్ నటించారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్...ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments