'ఈ నగరానికి ఏమైంది?' వ్యవధి ఎంతంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం 'పెళ్ళి చూపులు‘ తో కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. అనేక అవార్డులను కూడా అందుకున్నారు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. స్వల్ప విరామం తరువాత తన రెండో చిత్రంగా ‘ఈ నగరానికి ఏమైంది?’ ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి పెళ్ళి చూపులు, సమ్మోహనం చిత్రాల స్వరకర్త వివేక్ సాగర్ సంగీతమందించారు.
విశ్వస్ సేన్, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కకుమాను, అభినవ్ గోమతమ్, అనీషా అంబ్రోసి, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకి ‘యు/ఎ‘ సర్టిఫికేట్ లభించింది. అలాగే చిత్ర నిడివి 140 నిమిషాలు ఉంటుందని సర్టిఫికేట్ ప్రకారం తేలింది. ఒకవిధంగా ఈ డ్యూరేషన్ సినిమాకి ప్లస్ అయ్యే అంశంగా చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com