'ఈ న‌గ‌రానికి ఏమైంది?' వ్య‌వ‌ధి ఎంతంటే..

  • IndiaGlitz, [Thursday,June 28 2018]

తొలి చిత్రం 'పెళ్ళి చూపులు‘ తో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా.. అనేక అవార్డుల‌ను కూడా అందుకున్నారు యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. స్వ‌ల్ప విరామం త‌రువాత తన రెండో చిత్రంగా ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ ని తెర‌కెక్కించారు. సురేష్ ప్రొడ‌క్షన్స్ ప్రై.లిమిటెడ్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి పెళ్ళి చూపులు, స‌మ్మోహ‌నం చిత్రాల స్వ‌ర‌క‌ర్త వివేక్ సాగ‌ర్ సంగీత‌మందించారు.

విశ్వ‌స్ సేన్‌, సుశాంత్ రెడ్డి, వెంక‌టేష్ క‌కుమాను, అభిన‌వ్ గోమ‌త‌మ్‌, అనీషా అంబ్రోసి, సిమ్రాన్ చౌద‌రి ముఖ్య‌ పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ సినిమాకి ‘యు/ఎ‘ స‌ర్టిఫికేట్ ల‌భించింది. అలాగే చిత్ర నిడివి 140 నిమిషాలు ఉంటుంద‌ని స‌ర్టిఫికేట్ ప్ర‌కారం తేలింది. ఒక‌విధంగా ఈ డ్యూరేష‌న్ సినిమాకి ప్ల‌స్ అయ్యే అంశంగా చెప్పుకోవ‌చ్చు.

More News

నాగ‌చైత‌న్య కాదు.. సుమంత్‌

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న '@నర్తన శాల'

'ఛలో' ఘ‌న‌విజయం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్మాణ సంస్థ‌లో చేసిన ఈ చిత్రం భారీ లాభాల‌నే మూట‌గ‌ట్టుకుంది.

చివ‌రి షెడ్యూల్ లో 'ఆయుష్మాన్ భవ' న‌వంబ‌ర్ 9న విడుద‌ల‌

నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌.

నాచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా 'కురుక్షేత్రం' ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్షన్ హీరో అన‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు అర్జున్. అందుకే  యాక్ష‌న్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు.

య‌స్‌.వి.ఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న‌

వెండితెర విల‌క్ష‌ణ న‌టుడు య‌స్‌.వి.ఆర్‌. శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న జ‌ర‌గ‌నున్నాయ‌ని 'సంగ‌మం ఫౌండేష‌న్ సంస్థ అధ్య‌క్షులు, సినీ ప‌రిశోధ‌కులు సంజ‌య్ కిశోర్ తెలిపారు.