రాహుల్ విజయ్ హీరోగా వి.ఎస్.క్రియేటివ్స్ బ్యానర్‌లోరూపొందుతోన్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'
Send us your feedback to audioarticles@vaarta.com
ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్. ఈయన తనయుడు రాహుల్ విజయ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్ నిర్మాత. లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి `ఈ మాయ పేరేమిటో` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టైటిల్‌ను రివీల్ చేయడమే కాకుండా.. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను, ఓ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా...
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ - ''రాముగారు మంచి కథ చెప్పారు. సినిమా లవ్, అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. లవ్ మెయిన్ ఎలిమెంట్‌గా మిగిలిన ఎలిమెంట్స్‌గా అన్ని దానికి లింక్ అయ్యి ఉంటాయి. చెప్పిన దాని కంటే సినిమాను బ్యూటీఫుల్‌గా తీశారు. సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఎంటర్టైనింగ్గా, కూల్‌గా ఉంటుంది``అన్నారు.
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ - ``నాకు ఎంతో ఆదరణ ఇచ్చిన ఇండస్ట్రీలోకి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా అమ్మాయి దివ్య విజయ్ను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. దర్శకుడు రాము కొప్పులగారు మంచి కథను ఇంకా అద్భుతంగా తెరకెక్కించారు. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయి, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ - ``మంచి లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరిగాయి. రాహుల్ విజయ్‌గారు సూపర్బ్ పెర్ఫామర్.దివ్య విజయ్‌గారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మణిశర్మగారి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిట్ వర్క్ సినిమాకు మేజర్ ప్లస్ అవుతాయి. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది`` అన్నారు.
నిర్మాత దివ్యా విజయ్ మాట్లాడుతూ - ``సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. రాహుల్ విజయ్, కావ్యా థాపర్ పెయిర్ తెరపై చక్కగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్, కామెడీ ఎలిమెంట్స్ సహా అన్నీ అంశాలతో దర్శకుడు రాముగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తాం. మా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేశ్, సత్యం రాజేశ్, జోశ్ రవి, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్ కె.నాయుడు, ఫైట్స్: విజయ్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, నిర్మాత: దివ్యా విజయ్, దర్శకత్వం: రాము కొప్పుల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout