రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత

  • IndiaGlitz, [Tuesday,March 23 2021]

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా స్కూళ్లు తెరిచినప్పటి నుంచి కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఒక్కో స్కూల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేయనున్నారు.

ఈమేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు ఆమె అసెంబ్లీలో వెల్లడించారు. అన్ని విద్యాసంస్థలకూ ఇది వర్తిస్తుందన్నారు. కాగా.. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయని సబిత ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సీటీలు అన్నీ రేపటి నుంచి మూసివేయనున్నారు. మెడికల్‌ కాలేజీలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపారు.

తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వారం రోజులుగా విద్యాసంస్థల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితారెడ్డి భేటీ అయ్యారు. కరోనా వ్యాప్తి, విద్యాసంస్థలపై చర్చించారు. అనంతరం విద్యాసంస్థలను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

More News

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ?

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది.

విడుదలకు ముందే... ‘మరక్కర్’కు 3 జాతీయ అవార్డులు..

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది.

ర‌వితేజ రివేంజ్ డ్రామా..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు ఖిలాడి సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌వ‌గానే నెక్ట్స్ మూవీని త్రినాథ‌రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో

టాలీవుడ్ ఎంట్రీ కోసం సూర్య అదిరిపోయే స్కెచ్‌..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడో టాలీవుడ్‌లో త‌న‌దైన మార్క్ క్రియేట్ చేసుకుని ఓ మార్కెట్‌నుక్రియేట్ చేసుకున్నాడుగా,

ఫ‌హాద్ ఫాజిల్‌కు ‘పుష్ప’ కోసం ఇస్తున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, వెర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’.