రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా స్కూళ్లు తెరిచినప్పటి నుంచి కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఒక్కో స్కూల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేయనున్నారు.
ఈమేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు ఆమె అసెంబ్లీలో వెల్లడించారు. అన్ని విద్యాసంస్థలకూ ఇది వర్తిస్తుందన్నారు. కాగా.. గతంలో మాదిరిగానే ఆన్లైన్ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయని సబిత ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సీటీలు అన్నీ రేపటి నుంచి మూసివేయనున్నారు. మెడికల్ కాలేజీలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపారు.
తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వారం రోజులుగా విద్యాసంస్థల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్తో మంత్రి సబితారెడ్డి భేటీ అయ్యారు. కరోనా వ్యాప్తి, విద్యాసంస్థలపై చర్చించారు. అనంతరం విద్యాసంస్థలను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout