Ram Gopal Varma:ఆర్జీవీ చేతుల మీదుగా .. ‘సగిలేటి కథ’ ఫస్ట్‌ సింగిల్‌,  చిత్రయూనిట్‌కు వర్మ ఆల్ ది బెస్ట్

  • IndiaGlitz, [Saturday,August 19 2023]

బేబీ చిత్రం సక్సెస్ కావడంతో చిన్న సినిమా నిర్మాతలకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. కథ, కథనం బాగుంటే స్టార్ క్యాస్టింగ్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని తేలింది. దీంతో టాలీవుడ్‌లో చిన్న సినిమాల చిత్రీకరణలు జోరందుకున్నాయి. అంతేకాదు దర్శక నిర్మాతలు కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ కోవలోకి చెందినదే ‘‘సగిలేట కథ’’. రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రాజశేఖర్ సద్మూన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో నవదీప్ సీ-స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. సగిలేటి కథ సినిమా ట్రైలర్ చూశాక తనకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందన్నారు. డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్, సింగర్ కీర్తన శేష్‌కి వర్మ అభినందనలు తెలిపారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుందని.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆర్జీవీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ప్రొడ్యూజర్స్ దేవీప్రసాద్ బలివాడ మాట్లాడుతూ.. తాను పుట్టిన సంవత్సరంలో, ఆర్జీవీ సినిమాల్లోకి వచ్చారని, తనకు రెండేళ్లు వున్నప్పుడు 'శివ' మూవీని డైరెక్ట్ చేశారని చెప్పారు. తనకు ఊహ తెలియని వయసులో 'శివ' మూవీ చూసి 'శివ' అనే డైలాగ్ చెప్పానని.. అప్పటి నుంచి మా పేరెంట్స్ ముద్దుగా 'శివ' అని పిలిచేవారని దేవీప్రసాద్ అన్నారు. తనకు తెలియకుండానే ఆర్జీవీ గారు నా చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లూయెన్స్ చేశారని.. సినిమాల్లోకి రావడానికి ఒక బీజం నాటారని పేర్కొన్నారు. తాను నిర్మించిన మొదటి సినిమా 'కనుబడుటలేదు' నుండి 'సగిలేటి కథ' వరుకు ప్రత్యక్షంగా , పరోక్షంగా తనకు రామ్ గోపాల్ వర్మ హెల్ప్ చేస్తున్నారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు అన్నారు.

డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఆర్జీవీ చేతుల మీదుగా విడుదల చేయడంతో మాకు ఎంతో ఎనర్జీ వచ్చిందన్నారు. ఇందుకు గాను ఆయనికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. హీరో నవదీప్ ఎంత చెప్పినా తక్కువే.. ఎంత బిజీగా వున్నా వెంటనే స్పందించి తమకు కావలిసినవి సమకూరుస్తున్నారని థ్యాంక్స్ నవదీప్ అన్నా అంటూ రాజశేఖర్ ముగించారు.

More News

KTR:హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్, ఎన్ని ప్రత్యేకతలో

హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరింది. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ (వీఎస్టీ-ఇందిరా పార్క్)ను తెలంగాణ ఐటీ,

AP Govt:ఏపీలో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కార్డులకు చరమగీతం.. ఇప్పుడెలా..?

ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలను కార్డ్ రూపంలో జారీ చేయమని తెలిపింది.

Brahmanandam:ఘనంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం.. కేసీఆర్, వెంకయ్య నాయుడు, పవన్ హాజరు

ప్రముఖ సినీ నటుడు,  హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్ధ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.

Pawan Kalyan:450 ఎకరాలను అమ్మేసిన అవంతి అనుచరుడు.. మత్స్యకారులకు 10 లక్షలెక్కడ : పవన్‌‌కు గోడు వెళ్లబోసుకున్న బాధితులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర విశాఖపట్నం జిల్లాలో జరుగుతోంది.

Pawan Kalyan:నా మనుమడిని చంపి రోడ్డుపై పడేశారు .. అడిగితే బెదిరిస్తున్నారు : పవన్‌తో చెప్పుకున్న వృద్ధురాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర విశాఖపట్నం జిల్లాలో జరుగుతోంది.