ఏప్రిల్ 24 న శ్రీ ఏడిద నాగేశ్వరరావు 83వ జయంతి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏప్రిల్ 24 న శ్రీ ఏడిద నాగేశ్వరరావు 83 వ జయంతి ... శంకరాభరణం , సాగరసంగమం, స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 83 వ జయంతి ఏప్రిల్ 24 న . ఈ సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం .
కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, ఆయన మిత్రుడు శ్రీ వీ.బీ .రాజేంద్రప్రసాద్ గారి ఆహ్వానం తో మద్రాస్ రైలు ఎక్కేసారు . తీరా అక్కడ నిరాశే మిగిలింది. చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు . ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు .
అది నంచి విజయం సాధించింది . పలు ఇతర భాషల్లోకి రీమేక్ చెయ్యబడింది. తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం . తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లినఅద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు , box office కలెక్షన్స్ గాని , జాతీయ - అంతర్జాతీయ - రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం . అలాగే ఏ దేసేమెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్ . ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం.
ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం & మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ - సితార . ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ever green classic . సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది .ఇక స్వాతిముత్యం - కే.విశ్వనాధ్ కమలహాసన్ రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం . 1986 లో విడులయ్యిన ఈ చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ records ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఇక స్వయంకృషి - మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా , ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే .
అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద . మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది .ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు . మళ్ళీ విశ్వనాధ్ - చురంజీవి లతో తీసిన చిత్రం , ఆపత్బాంధవుడు . చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ . రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది . ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి , మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే సినీ అభిమానులకు చాలా నిరాశే . పద్మ అవార్డుల్లో కానీ , రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే . కానీ సినీ రాజకీయాల వల్ల , కొందరు సినీ పెద్దల ఏక పక్ష నిర్ణయాల వల్ల , శ్రీ ఏడిదకు దక్క వలసిన గుర్తింపు దక్కలేదు . కనీసం కీర్తిశేషులైన తర్వాత ఇచ్ఛే అవకాశం ఉన్న బిరుధులు ,ఇప్పటి తెలుగు ప్రభుత్వాలు ఆయనకీ బహుకరిస్తే బాగుంటుంది .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments