కొత్త పెళ్ళికూతురికి ఈడీ సమన్లు.. హీరోయిన్ పై రూ.1.5 కోట్ల వివాదం!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే యామి గౌతమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ డైరెక్టర్ ఆదిత్య ధార్ ని ఇటీవలే యామి గౌతమ్ వివాహం చేసుకుంది. తాజాగా ఆమెకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేయడం ఉత్కంఠగా మారింది.
ఫారెన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఆమెకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. యామి గౌతమ్ కి చెందిన బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ.1.5 కోట్ల లావాదేవీ వరకు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యామి గౌతమ్ కు ఇలా ఈడీ సమన్లు పంపడం ఇది రెండవసారి. జూలై 7న తమ ముందు యామి గౌతమ్ తప్పకుండా హాజరు కావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. యామి గౌతమ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రయివేట్ బ్యాంక్ ద్వారా ఓ అనుమాస్పద ఫారెన్ ఎక్స్ చేంజ్ లావాదేవీ చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఈడీ అధికారులు జల్లెడ పట్టి ఈ లావాదేవీని గుర్తించారు. ఎవరు జరిపిన ప్రాధమిక విచారణలో ఈ బ్యాంకు అకౌంట్ యామి గౌతమ్ దే అని నిర్దారణకు వచ్చారు.
ఇదిలా ఉండగా ఈడీ బాలీవుడ్ బడా సంస్థలపై మనీ లాండరింగ్ వ్యవహారంలో నిఘా పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో పేరున్న సంస్థలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వివాహం తర్వాత యామి గౌతమ్ తాను పూర్తి చేయవలసిన చిత్రాల చిత్రీకరణలో పాల్గొంది. మొత్తానికి కొత్త పెళ్ళికూతురికి లేనిపోని చిక్కులే వచ్చాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com