Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు హాజరవ్వాలని ఆదేశం
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పరిణామాలు మరోసారి వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, రామచంద్ర పిళ్లైలు అప్రూవర్లుగా మారడంతో కేసులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్త్ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెను ఈడీ ఆదేశించింది. రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఆయన అప్రూవర్‌గా మారడం.. గంటల వ్యవధిలో కవితకు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సౌత్ లాబీలో కవిత ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఆమెకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం :
కాగా.. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2021, 2022లో రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. గతేడాది నవంబర్ 17న అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానంలో నగరాన్ని 32 జోన్లుగా విభజించి 849 షాపులకు ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్స్‌లు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు తప్పుబడుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. ఆయన సిఫారసు మేరకు సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగాయి.
మనీష్ సిసోడియా అరెస్ట్‌తో కలకలం:
ఈ కేసులో ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లైలను అదుపులోకి తీసుకున్నారు. పిళ్లైను బినామీగా పెట్టి.. కవిత తెరవెనుక చక్రం తిప్పారని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా, రామచంద్ర పిళ్లైలు అప్రూవర్లుగా మారారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments