Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు హాజరవ్వాలని ఆదేశం

  • IndiaGlitz, [Thursday,September 14 2023]

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పరిణామాలు మరోసారి వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, రామచంద్ర పిళ్లైలు అప్రూవర్‌లుగా మారడంతో కేసులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్త్ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెను ఈడీ ఆదేశించింది. రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఆయన అప్రూవర్‌గా మారడం.. గంటల వ్యవధిలో కవితకు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సౌత్ లాబీలో కవిత ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఆమెకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం :

కాగా.. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వం 2021, 2022లో రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. గతేడాది నవంబర్ 17న అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానంలో నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్స్‌లు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు తప్పుబడుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. ఆయన సిఫారసు మేరకు సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగాయి.

మనీష్ సిసోడియా అరెస్ట్‌తో కలకలం:

ఈ కేసులో ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లైలను అదుపులోకి తీసుకున్నారు. పిళ్లైను బినామీగా పెట్టి.. కవిత తెరవెనుక చక్రం తిప్పారని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా, రామచంద్ర పిళ్లైలు అప్రూవర్‌లుగా మారారు

More News

Ram Gopal Varma:చంద్రబాబు అరెస్ట్‌పై జూ.ఎన్టీఆర్ మౌనం.. టీడీపీకి ఇక దబిడి దిబిడే, ఆర్జీవీ ట్వీట్ వైరల్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో దేశం ఉలిక్కిపడింది.

Bigg Boss 7 Telugu : కోపంతో ఊగిపోయిన శివాజీ , షాకైన కంటెస్టెంట్స్.. ‘‘కీ’’ కోసం జాగారం.. కానీ

సోమ, మంగళవారాలు నామినేషన్స్‌తో హౌస్ హీటెక్కడంతో బిగ్‌బాస్ ఇంటిని కూల్ చేసే పని మొదలెట్టాడు.

Pawan Kalyan : రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో ములాఖత్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో వున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రేపు జనసేన అధ్యక్షుడు

Salaar : 'సలార్ '.. పోస్టుపోన్ అవుతుందని ముందే చెప్పిన గురూజీ, 100 శాతం నిజమైన అంచనా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘సలార్’’ మూవీ రిలీజ్‌ డేట్‌పై సోషల్ మీడియాలో

Salaar :'సలార్' యూనిట్ షాకిచ్చిందిగా.. రిలీజ్ డేట్‌పై సంచలన ప్రకటన

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘సలార్’’.