టీవీ9 భారత్ వర్ష్‌కు ఈసీ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ9 పై వస్తున్న వరుస వివాదాలతో సదరు టీవీ యాజామాన్యం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది.! ఇప్పటికే టీవీ9 సీఈవో ఉన్న రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు టీవీలో 91 శాతం షేర్లున్న అలందా మీడియా సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
రవిప్రకాష్ శుక్రవారం 11గంటలకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఇంత వరకూ ఆయన హాజరుకాలేదు. మరో వైపు టీవీ9 నుంచి రవిప్రకాష్‌ను పూర్తిగా తప్పించాలంటూ ప్రస్తుతం బోర్డు మీటింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారం మరికాసేపట్లో తేలిపోనుంది.
అయితే ఈ వివాదాల నేపథ్యంలో టీవీ9 భారత్ వర్ష్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మిస్సయ్యాయని తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంల భద్రత, తరలింపు అంశాలపై అత్యున్నత న్యాయస్థానం నిఘా ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.
తప్పుడు రిపోర్టింగ్ చేయకుండా జర్నలిజం ప్రమాణాలు కాపాడాలని ఈసీ హితవు పలికింది. జర్నలిజం విలువలు విడిచి దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని టీవీ9 భారత్ వర్ష్‌పై ఈసీ కన్నెర్రజేసింది. ప్రజల్లోకి తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని సదరు టీవీ చానెల్‌కు ఈసీ హితవు పలికింది. కాగా కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా టీవీ9 భారత్ వర్ష్‌ను ప్రారంభించిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout