బాబుకు ఊహించని షాకిచ్చిన ఈసీ ..ఈ దెబ్బతో..!

  • IndiaGlitz, [Saturday,March 30 2019]

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌‌లు ఎక్కువయ్యాయి. ఒక షాక్ నుంచి తేరుకోక మునుపే మరో ఎదురుదెబ్బ తగులుతుండటంతో అసలేం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందట. అభ్యర్థుల ప్రకటన మొదలవ్వగానే పలువురు అభ్యర్థులు వైసీపీలోకి జంప్ అవ్వడం మొదలుకుని పోలీసు ఉన్నతాధికారులు బదిలీల వరకు అన్నీ టీడీపీకి ఎదురుదెబ్బలే.

ఇక అసలు విషయానికొస్తే.. 2014లో ఇచ్చిన కొన్ని వందల హామీల్లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు భృతి ఇవ్వడం కూడా ఒకటి. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల ఓట్లను టీడీపీ ఖాతాలోకి వేసుకునేందుకు నెలకు వెయ్యి రూపాయిలు ఇస్తున్న విషయం విదితమే. అయితే ప్రత్యర్థి పార్టీ ఎత్తులు, వ్యూహాలతో మరో అడుగు ముందుకేసిన చంద్రబాబు.. ఏప్రిల్ నుంచి ఆ వెయ్యి కాస్త డబుల్ చేసి అంటే రెండు వేల రూపాయిలు చేసి నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని మాటిచ్చారు. అయితే ఈ పెంపుకు ఎన్నికల కమిషన్ మోకాలడ్డేసింది. ఎన్నికల పూర్తయ్యేంత వరకూ ఎలాంటి పెంపు ఉండరాదని తేల్చిచెప్పింది.. అంతేకాదు ఈసీ నిర్ణయాలు ఖాతరు చేయకుండా ఇష్టానుసారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఒకింత హెచ్చరించింది కూడా.

నిరుద్యోగ భృతికి ‘నో’.. కానీ..

కాగా.. ఇటీవల టీడీపీ సర్కార్.. ముఖ్యమంత్రి యువనేస్తంతో పాటు, పలు ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లాంటి పథకాలకు సంబంధించిన విషయమై ఈసీ అనుమతి కోరుతూ ఓ లేఖ రాయడం జరిగింది. ఇందుకు స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లో ఉన్నందున పెంపునకు వీలుకాదని.. తక్షణమే ఈ ప్రయత్నం ఆపాలని తేల్చిచెప్పింది. నిరుద్యోగ భృతికి నో చెప్పిన ఈసీ.. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు, రాష్ట్ర సమాచార కమిషనర్‌ నియామకం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లాంటి ప్రతిపాదనలకు మాత్రం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఓ లేఖ అందింది.

ఇదంతా కావాల్సిందే..!?

కాగా.. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలయ్యే టైమ్‌‌కు ముందుగానే చంద్రబాబు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లారని విమర్శలు వినవస్తున్నాయి. ఎలాగో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది గనుక.. తిన్నగా ఎన్నికల కమిషన్ మీద తోసేయచ్చనే ప్లాన్‌తోనే బాబు ఎంతసేపూ ఏప్రిల్.. ఏప్రిల్ అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పారంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. మరోవైపు నిరుద్యోగులు సైతం మా నోట్లో నారావారి బాబు మట్టి కొట్టారంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధిపతిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈసీ మెకాలడ్డేయడంతో చంద్రబాబు అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అని విమర్శకులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇది ఊహించని షాక్ అని కొందరు విశ్లేషకులు అంటుండగా.. అదేంకాదని ఇదంతా బాబు హై డ్రామా అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే నిరుద్యోగుల ఓట్లు ఈసారి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని దీన్ని బట్టి అర్థం చేస్కోవచ్చు. అయితే ఈ వ్యవహారంపై ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

వైరల్ న్యూస్: గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు!

గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోవడమేంటి..? అని కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. కాస్త ఈ విషయంపై క్లారిటీ వస్తే నిజమా..?

వైఎస్‌ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు!

రాబోయే ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

అవినీతిలేని రాజకీయ వ్యవస్థ కోసం జనసేనను గెలిపించండి

ఆదోని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రాష్ట్రంలో ఎక్కడా క‌న‌బ‌డ‌ని ఓ చిత్రమైన‌ రాజ‌కీయ ప‌రిస్థితులు క‌న‌బ‌డ‌తాయని, రాజ‌కీయ ప్రత్యర్ధులు కేవలం రాజ‌కీయాల‌కి మాత్రమే ప్రత్యర్ధులని,

ఉచిత విద్య, వైద్యం అందిస్తాం: పవన్

జ‌న‌సేన ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత నంద్యాల పార్లమెంటుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

కరవు సీమ కాదు.. కల్పతరువు సీమగా చేస్తా!

రాయ‌ల‌సీమ‌ క‌రవు సీమగా కాదు, క‌ల్పత‌రువు సీమ‌గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ సీమ ప్రజలకు హామీ ఇచ్చారు.