లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఈసీ అనుమతి
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత నేత ఎన్టీఆర్ జీవితంలో ఓ ఘట్టంతో తెరకెక్కిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన దగ్గరి నుండి ఆయన తన ముఖ్యమంత్రిని ఎలా కోల్పోయారు. చివరకు ఎలా ప్రాణాలు విడిచారు. ఆయన మానసిక వేదనలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఎంత వరకు ఉంది? ఇలాంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నికల సమయంలో విడుదలైతే తెలుగుదేశం పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు నేతలు ఎన్నికల కమీషన్‌కు పిర్యాదు చేశారు.
పిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమీషన్.. చి త్ర నిర్మాత రాకేష్ రెడ్డిని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందు హాజరు కావాలని కోరింది. ఈసీ ఆదేశించినట్లుగా చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కమిటీ ముందుకు సోమవానం హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ "సినిమాకు సంబంధించి ఈసీ అడిగిన ప్రశ్నలకు మేం సమాధానం చెప్పాం. వారు మా ప్రశ్నలతో సంతృప్తిగా ఉన్నారని అనిపించింది. సినిమా విడుదలకు అంగీకరించారు. విడుదల తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ హాజరు కావాలని కూడా సూచించారు. ఈ సినిమాను లక్ష్మీ పార్వతిగారు రాసిన పుస్తకం ఆధారంగానే తీశాం"అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments