EC Notices:ఇటు బీఆర్ఎస్‌ పార్టీకి.. అటు కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ నోటీసులు..

  • IndiaGlitz, [Tuesday,November 28 2023]

బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే రైతుబంధు నిధుల విడుదల నిలిపివేయాలని ఈసీ ఆదేశించగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ గులాబీ పార్టీకి నోటీసులు జారీ చేశారు. స్కాంగ్రెస్ అని సంబోధిస్తూ ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల కమిషన్‌కు హస్తం నేతలు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన సీఈవో.. బీఆర్‌ఎస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో నోటీసులపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం..

మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణలో కర్ణాటకకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ పక్క రాష్ట్రంలో ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని మండిపడింది. దీనిపై మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. వెంటనే కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు తెలంగాణలో నిలిపివేయాలని ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని లేఖలో పేర్కొంది.

రైతుబంధు సాయం నిలిపివేత..

కాగా రైతులకు 'రైతుబంధు' సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు ప్రకటన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని.. అందుకే రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించింది. రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సీఈసీ ఝులక్‌లు ఇస్తుంది.

More News

Bigg Boss Telugu 7 : నమ్మకద్రోహమంటూ ప్రశాంత్ కంటతడి, శివాజీని టార్గెట్ చేసిన హౌస్‌మేట్స్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దివారాల్లో షో ముగియనుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా రతిక,

Prime Minister Modi:హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా హాజరైన కార్యకర్తలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‭లో ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్ షో ముగిసింది.

Arun Vikkirala:ప్రతీ ఒక్కరికీ నచ్చేలా తీశాను.. ‘కాలింగ్ సహస్ర’పై దర్శకుడు అరుణ్ విక్కిరాలా

బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’.

Aadudam Andhra: 'ఆడుదాం ఆంధ్రా' పోటీలకు రిజిస్ట్రేషన్లు షూరూ.. వివరాలు ఇవే..

సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువతను క్రీడారంగంలో ప్రోత్సహించేలా 'ఆడుదాం ఆంధ్రా' ప్రోగ్రామ్‌కు నడుం బిగించింది.

Election Campaign End:రేపటితో ముగియనున్న ప్రచారం.. నేతల సుడిగాలి పర్యటనలు..

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. కేవలం 48 గంటలు మాత్రమే ప్రచారానికి మిగిలింది.