ఏపీ పది ఫలితాలు విడుదల.. తూ.గో టాప్.. నెల్లూరు లాస్ట్

  • IndiaGlitz, [Tuesday,May 14 2019]

ఆంధ్రప్రదేశ్‌ పది ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 6,30,082 మంది విద్యార్థులు హాజరవ్వగా వీరిలో 6, 19, 494 రెగ్యులర్, 10,588 ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని సంధ్యారాణి వెల్లడించారు. వీరిలో 94.88 శాతం రెగ్యులర్ విద్యార్థులు పాస్ అవ్వగా.. బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 94.88శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా తెలంగాణలాగే ఏపీలో కూడా బాలికలు పై చేయి సాధించడం విశేషమని చెప్పుకోవచ్చు.

ప్రైవేటు విద్యార్థులు ఉత్తర్ణీత:-

బాలికలు : 61.84 శాతం

బాలురు : 51.72 శాతం

ఏపీ రెసిడెన్షియల్ విద్యార్థులు : 98.24 శాతంతో టాప్‌

ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు : 87.16 శాతంతో లాస్ట్‌ రాగా.. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం మెచ్చుకోదగ్గ విషయం. కాగా.. 5400 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమని చెప్పుకోవచ్చు. మూడు పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత రావడం గమనార్హం.

జిల్లాల్లో ఎవరు ఫస్ట్.. ఎవరు లాస్ట్..

తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతంతో ప్రథమస్థానం

ప్రకాశం జిల్లా 98.17 శాతంతో రెండో స్థానం

చిత్తూరు జిల్లా 97.41 శాతంతో మూడో స్థానం

విజయనగరం 97.28 శాతంతో నాలుగో స్థానం

విశాఖ జిల్లా 96.37 శాతంతో ఐదో స్థానం

శ్రీకాకుళం జిల్లా 95.58 శాతంతో ఆరో స్థానం

అనంతపురం జిల్లా 95.55 శాతంతో ఏడో స్థానం

గుంటూరు జిల్లా 95.35 శాతంతో ఎనిమిదవ స్థానం

కృష్ణా జిల్లా 93.96 శాతంతో తొమ్మిదవ స్థానం

పశ్చిమ గోదావరి జిల్లా 93.29 శాతంతో పదవ స్థానం

కడప జిల్లా 92.90 శాతంతో 11వ స్థానం

కర్నూలు జిల్లా 92.10 శాతంతో 12వ స్థానం

నెల్లూరు జిల్లా 83.19 శాతంతో 13వ స్థానం (లాస్ట్)

పరీక్షలు ఎప్పట్నుంచి...

కాగా.. పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు జూన్‌ 17 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జూన్‌ 6 దరఖాస్తు గడువు ఉంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ దరఖాస్తు గడువు మే 30.

వచ్చే ఏడాది నుంచి...

ఇదిలా ఉంటే.. రెండు రోజుల్లో వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలు ఉంచుతామని కమిషనర్‌ సంధ్యారాణి మీడియాకు వివరించారు. కాగా.. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేయాలని ప్రతిపాదించారు. పరీక్షా పేపర్‌ విధానంలోనూ మార్పులు ఉండొచ్చని.. స్పోర్ట్స్‌ కోటాకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సంధ్యారాణి తెలిపారు. కాగా ఈ ప్రపోజల్‌పై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని.. అనుమతి రాగానే ప్రకటిస్తామని కమిషనర్‌ సంధ్యారాణి స్పష్టం చేశారు.

More News

ప‌రువు హ‌త్య‌లే ప్ర‌ధానంగా 'ఉప్పెన‌'..

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందుతున్న సినిమాలకు ఈ మ‌ధ్య ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి. అదే కోవ‌లో మెగా కాంపౌండ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ సినిమా `ఉప్పెన‌` తెరకెక్క‌నుంది.

ద్విపాత్రాభిన‌యం చేస్తున్నజ‌గ‌ప‌తిబాబు

హీరోగా కంటే విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తూ చేతినిండా సినిమాల‌తో జ‌గ‌ప‌తిబాబు బిజీ బిజీగా ఉన్నారు.

హీరోగా వి.వి.వినాయ‌క్‌

స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం నుండి యాక్టింగ్ వైపు అడుగులు వేస్తున్నారని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదంలో కడప జాయింట్ కలెక్టర్‌ బలి!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదం కడప జిల్లా జాయింట్‌ కలెక్టర్‌‌ కోటేశ్వరరావుకు ఎసరు తెచ్చిపెట్టింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

టాలీవుడ్‌లో ఆ మూడు బూతు సినిమాలకు బ్రేక్ పడనుందా!!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ముద్దు సీన్లు తీయాలన్నా.. నటించాలన్నా ఎంతగానో ఆలోచించే వారు.. అయితే ఇప్పుడు మాత్రం ఆ ముద్దు సీన్లే కాదు.. ఇంకేవేవో ఏకంగా సినిమాల్లోనే కానిచ్చేస్తున్నారు.