Eagle:ఇది విధ్వంసం మాత్రమే.. త్వరలోనే విశ్వరూపం.. 'ఈగల్' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Monday,November 06 2023]

హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja). మొన్న దసరా పండుగ సందర్భంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

కొండలో లావాను కిందికి పిలవకు ఊరు ఉండదు. నీ ఉనికి ఉండదు అంటూ రవితేజ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతంది. రవితేజ అజ్ఞాతంలో ఉండి ప్రజలను కాపాడుతున్నట్లు ఇందులో చూపించారు. వెలుతురు వెళ్లే ప్రతిచోటకీ వాడి బుల్లెట్ వెళ్తుంది.. ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపం అనే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. చివరలో రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి మాస్ లుక్‌లో అదరగొట్టాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌. కావ్య థాపర్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. మధుబాల, అవసపరాల శ్రీనివాస్, నవదీప్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు గోపిచందర్ మలినేని దర్శకత్వంలో తన తర్వాతి చిత్రం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.

More News

Bigg Boss Telugu 7 : టేస్టీ తేజా ఎలిమినేషన్ .. నువ్వు లేకుండా వుండలేనంటూ శోభా కంటతడి, నాగ్ సైతం ఎమోషనల్

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో వరుసగా అమ్మాయిలే ఎలిమినేషన్ అవుతున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకున్న నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

Bigg Boss Telugu 7 : హౌస్‌లో బంగారం ఎవరు.. మట్టి ఎవరు, గౌతమ్ పసలేని వాదన..  శివాజీని మళ్లీ పొగిడిన నాగార్జున

అమర్‌దీప్ పోరాటంతో శోభాశెట్టి హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా నిలిచింది. అంతేకాదు.. బిగ్‌బాస్ సీజన్ 7లో కెప్టెన్ అయిన తొలి ఫిమేల్ కంటెస్టెంట్‌గా నిలిచింది.

KTR:మంత్రి కేటీఆర్‌పై కేసు.. న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ హెచ్చరిక

తెలంగాణ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. వాడివేడి విమర్శలతో నేతలు ప్రచారంలో వేడి పుట్టిస్తున్నారు.

Mahesh Babu:మహేష్ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ అప్టేడ్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చేసింది.

Pawan Kalyan:చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్‌.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు.