Eagle:ఇది విధ్వంసం మాత్రమే.. త్వరలోనే విశ్వరూపం.. 'ఈగల్' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja). మొన్న దసరా పండుగ సందర్భంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
"కొండలో లావాను కిందికి పిలవకు ఊరు ఉండదు. నీ ఉనికి ఉండదు" అంటూ రవితేజ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతంది. రవితేజ అజ్ఞాతంలో ఉండి ప్రజలను కాపాడుతున్నట్లు ఇందులో చూపించారు. "వెలుతురు వెళ్లే ప్రతిచోటకీ వాడి బుల్లెట్ వెళ్తుంది".. "ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపం" అనే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. చివరలో రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి మాస్ లుక్‌లో అదరగొట్టాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్. కావ్య థాపర్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. మధుబాల, అవసపరాల శ్రీనివాస్, నవదీప్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు గోపిచందర్ మలినేని దర్శకత్వంలో తన తర్వాతి చిత్రం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com