ఒక్క మామిడి కాయ ధర రూ.21 వేలు.. 9 శునకాలు, 3 గార్డ్స్ తో తోటకు కాపలా!
Send us your feedback to audioarticles@vaarta.com
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్, జబల్పూర్ కి చెందిన సంకల్ప్ సింగ్ పరిహర్ అనే రైతు తన మామిడి తోటకు 9 జర్మన్ షిపార్డ్ కుక్కలు, ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ని కాపలాగా ఉంచాడు. ఒక మామిడి తోటకు ఇలా హై లెవల్ సెక్యూరిటీ అంటే వినడానికి ఆశ్చరంగానే ఉంటుంది.
వివరాల్లోకి వెళితే.. సంకల్ప్ సింగ్ కు 12 ఎకరాల మామిడి తోట ఉంది. దాదాపు 1100 మామిడి చెట్లు ఉన్నాయి. ఇందులో 50 మామిడి చెట్లు 'టాయెనో టమాగో' అనే జపనీస్ రకానికి చెందిన వంగడం. ఈ రకానికి చెందిన ఒక్క మామిడి కాయ ధర రూ. 21 వేలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా దీనికి పేరు ఉంది.
పర్యావరణం చాలా సమతుల్యంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చెట్లు పెరుగుతాయి. సంకల్ప్ ఐదేళ్ల క్రితం ఈ మొక్కలని తెప్పించి తన తోటలో నాటగా ఇప్పుడు కాపుకి వచ్చాయి. ప్రస్తుతం 50 చెట్లలో నాలుగు కాయలు మాత్రమే ఉన్నాయి. కాపు మొదలైన ఈ తరుణంలోనే కాపలా అవసరం అని భావించిన సంకల్ప్ హై లెవల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ మామిడి కాయల విలువ తెలిసి కొందరు ఇటీవల దొంగతనానికి కూడా ప్రయత్నించినట్లు తెలిపాడు. 'టాయెనో టమాగో' ఒక్క మామిడి కాయ ధర గతంలో 2.7 లక్షల వరకు ఉండేదట. చెన్నై నుంచి 2.5 లక్షల ఖర్చుతో ఏ రకానికి చెందిన 100 మామిడి చెట్లని సంకల్ప్ కొన్నాడు. వాటిలో 50 మాత్రమే పెరిగి పెద్దయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments