సెప్టెంబర్ 3న 'డైనమైట్' ప్రివ్య షో
Send us your feedback to audioarticles@vaarta.com
డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ డైనమైట్`. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. ప్రణీత హీరోయిన్. దేవాకట్టా దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 3న హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో హీరో, నిర్మాత మంచు విష్ణు ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. ఈ షో కి ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను అందరినీ ఆహ్వానించారు. భారీ ఎత్తున సెలబ్రిటీస్ ఈ షో కి హాజరవుతారని సమాచారం. విజయన్ మాస్టర్ నేతృత్వంలో రూపొందిన యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ గా నిలస్తుందని చిత్రయూనిట్ ధీమాను వ్యక్తం చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments