ఓవర్ సీస్ లో 'డైనమైట్ ' క్రేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డైనమైట్' సినిమాని రూపొందించారు. విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా కోసం మంచు విష్ణు చెవి పోగు,చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో కనువిందు చేయనున్నారు. అలాగే సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. విష్ణు సరసన గ్లామరస్ హీరోయిన్ ప్రణీత హీరోయిన్‌గా నటించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆదరగొట్టింది. మంచు విష్ణు నటన, లుక్, ఫైట్ మాస్టర్ విజయన్ అందించిన యాక్షన్ సీక్వెన్స్, దేవాకట్టా టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
ఇటీవల అచ్చు సంగీతం అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ` సర్టిఫికేట్ ను పొందింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. విజయన్ మాస్టర్ నేతృత్వంలో విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు అందించారు. ఫెంటాస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం యు.ఎస్, యు.కె, యు.ఎ.ఇ, నేపాల్ లో కూడా విడుదలవుతుంది.
దీని గురించి యు.ఎస్.ఎ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సి.ఇ.వో రాజ్.కె మాట్లాడుతూ ఓవర్ సీస్ లో అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన డైనమైట్ చిత్రంపై మంచి టాక్ ఉంది. ఇక్కడ థియేటర్స్ ఓనర్స్, సినీ అభిమానులు సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మా బ్యానర్ లో వచ్చిన చిత్రాలన్నింటిలో డైనమైట్ పెద్ద హిట్టై బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అన్నారు. మంచి కథ, మ్యూజిక్, యాక్షన్, మంచు విష్ణు హై వోల్టేజ్ ఫెర్ ఫార్మెన్స్ ఉన్న ఈ సినిమా తిరుగులేని సక్సెస్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments