పెళ్లిచూపులు హీరో ద్వార‌క టీజ‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Thursday,August 25 2016]

పెళ్లిచూపులు సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం ద్వారక‌. ఈ చిత్రాన్ని సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ద్యుమ్న చంద్ర‌పాటి, గ‌ణేష్ పెనుబోతు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ర‌వీంద్ర (ఎం.ఎస్.ఆర్) ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ద్వార‌క టీజ‌ర్ ను రిలీజ్ చేసారు.

కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన భ‌జ‌రే నంద‌గోపాల హ‌రే...అనే సాంగ్ టీజ‌ర్ క‌ల‌ర్ ఫుల్ గా ఉంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ కొంచెం కొత్త‌గా... ఇంకొంచెం అందంగా ఉన్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న రైట్ రైట్ ఫేమ్ పూజా జ‌వేరి న‌టిస్తుంది. లెజెండ్ సినిమా ప‌తాకం పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నెక్ట్స్ టైమ్ అలా జ‌ర‌గ‌కుండా చూస్తానంటున్న చ‌ర‌ణ్‌..!

మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌లును ఎక్క‌డెక్క‌డి నుంచో హైద‌రాబాద్ వ‌చ్చి అభిమానులు శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.

నేడు తిరుప‌తికి ప‌వ‌న్..!

క‌ర్నాట‌క‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ అభిమాని వినోద్  హ‌త్య‌కు గుర‌య్యారు. అస‌లు ఏం జ‌రిగింది అంటే...అదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానితో ప‌వ‌న్ అభిమాని వినోద్ రాయ‌ల్ కి వాగ్వివాదాం జ‌ర‌గ‌డం.

సెప్టెంబర్ 9న 'జ్యో అచ్యుతానంద'

నారా రోహిత్,నాగశౌర్య,రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'జ్యో అచ్యుతానంద'.

ఇంకా చర్చల దశలోనే ఉందట...

నందమూరి హీరో కల్యాణ్ రామ్,మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

చరణ్ కి రాఖీ కట్టిన చిట్టి చెల్లి ఎవరో తెలుసా..!

ఈనెల18న రక్షాబంధన్ సందర్భంగా రామ్ చరణ్ కి రాఖీ కట్టిన చిట్టి చెల్లి ఎవరో కాదు...