నవంబర్ లో 'ద్వారక'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌గుడ్ ఫిలింస్ సమర్పణలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న- గణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా “ద్వారక`.ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ `పెళ్లిచూపులు`తో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ కథానాయకుడుగా, పూజా జవేరి కథానాయిక. శ్రీనివాస్ రవీంద్ర (ఎంఎస్ఆర్) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...
నిర్మాత ప్రద్యుమ్న మాట్లాడుతూ -“శ్రీనివాస్ రవీంద్ర(ఎం.ఎస్.ఆర్) దర్శకత్వం వహించిన ద్వారక సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. పెళ్ళిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా కచ్చితంగా తనకు మరో హిట్ మూవీ అవుతుందని కచ్చితంగా చెప్పగలను. మా సినిమాకు ఆర్.బి.చౌదరి వంటి సీనియర్ నిర్మాతగారు అండగా నిలబడటం మాలో మరింత ఆత్మవిశ్వాస్వాన్ని నింపింది. మంచి ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నికల్ టీం కుదిరింది.
ఇటీవల సాయికార్తీక్ అందించిన పాటలు మార్కట్లోకి విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. లక్ష్మీభూపాల్ మాటలు, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com