ద్వారక సెన్సార్ పూర్తి - ఈనెలలోనే రిలీజ్..!

  • IndiaGlitz, [Tuesday,November 08 2016]

విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా న‌టించిన‌ చిత్రం ద్వార‌క‌. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ ర‌వీంద్ర తెర‌కెక్కించారు. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్ పై ప్రద్యుమ్న, గణేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్స్ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం బాగుంది అంటూ ద్వారక టీమ్ ని అభినందించారు. ఈ మూవీ ట్రైల‌ర్ 1 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం విశేషం. ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించారు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల‌లోనే రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాత‌లు తెలియ‌చేసారు.
విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్‌, కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, ఉత్తేజ్‌, నవీన్‌, గిరిధర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్‌, ఫైట్స్‌: విజయ్‌, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: సాయికార్తీక్‌, నిర్మాతలు: ప్రద్యుమ్న, గణేష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ రవీంద్ర(ఎం.ఎస్‌.ఆర్‌).

More News

పవన్ మూవీకి వర్క్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నారు.

అతిథి పాత్రలో అవికాగోర్....

స్వామిరారా','కార్తికేయ','సూర్య vs సూర్య' లాంటి వైవిధ్యమైన కథాంశాలతో

దిల్ రాజు విడుదల చేసిన 'ఒక్కడొచ్చాడు' ఆడియో

మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్ లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ పై

'జయమ్మునిశ్చయమ్మురా' సెన్సార్ పూర్తి

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ ఫిలింస్ పతాకంపై..

ఆకలి వేసినప్పుడు తినే సింహాన్ని అంటూ అదరగొట్టేస్తున్న ఎస్ 3 టీజర్..!

సూర్య,హరి కాంబినేషన్లో సింగం సిరీస్ లో వస్తున్న మూడవ చిత్రం ఎస్ 3.ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క,శృతిహాసన్ నటిస్తున్నారు.