మహేష్‌బాబుతో సినిమా తియ్యాలన్న నా కోరిక 'భరత్ అనే నేను' తో తీరింది - ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌తో సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మించిన భారీ క్రేజీ చిత్రం 'భరత్ అనే నేను'. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్గా నటించింది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలోని 'వచ్చాడయ్యో సామి..' పాట బిగ్ హిట్ అయి సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచింది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ను సాధించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 20న వరల్డ్‌వైడ్‌గా హైయ్యస్ట్ స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 17న హైదరాబాద్ దసపల్లా హోటల్లో చిత్ర నిర్మాత దానయ్య డి.వి.వి. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మా బేనర్లో గర్వపడే చిత్రం అవుతుంది!!
స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''1992లో 'జంబలకిడి పంబ' చిత్రంతో నిర్మాతగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు, యావరేజ్ చిత్రాలు తీశాం. ఈ సక్సెస్ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్‌తో కొరటాల శివ దర్శకత్వంలో మా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ బేనర్లో 'భరత్ అనే నేను' సినిమాని భారీగా నిర్మించాం. నిన్ననే సెన్సార్ పూర్తయింది.
ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యులంతా సినిమా చూసి చాలా బాగుంది. గొప్ప సినిమా తీశారు అని అప్రిషియేట్ చేశారు. మా బేనర్‌కి గర్వపడే సినిమా అవుతుంది. చాలా గొప్పగా వుంటుంది. రిలీజ్ తర్వాత అందరూ ఇదే ఫీలవుతారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న మహేష్‌గారి మదర్ బర్త్‌డే సందర్భంగా హైయ్యస్ట్ థియేటర్స్‌లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పట్నుంచో మహేష్‌బాబుతో సినిమా తియ్యాలనేది నా కల. అది ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది. కొరటాల శివగారు అద్భుతమైన కథతో బిగ్ స్పాన్‌తో ఈ సినిమాని చాలా గొప్పగా తీశారు. ఇంత మంచి చిత్రాన్ని మా బేనర్లో తీసిన కొరటాల శివగారికి జీవితాంతం రుణపడి వుంటాను. మా బేనర్లో సినిమా చెయ్యమని మహేష్‌గారికి ఎప్పట్నుంచో అడుగుతున్నాను. ఇన్నాళ్టికి నాకు అవకాశం ఇచ్చి ఒక మెమొరబుల్ సినిమా ఇచ్చారు. అందరూ గవ్వపడే సినిమా ఇచ్చిన ఆయనకి నా కృతజ్ఞతలు''.
నాకు ఇన్స్పిరేషన్ ఆయనే!!
మాది వెస్ట్‌గోదావరి జిల్లా. గోదావరి ప్రక్కన తాటిపాక. నేను చదువుకునే రోజుల్లో ఎన్నో సినిమాలు అక్కడ షూటింగ్‌లు జరిగేవి. ఒకసారి కృష్ణగారి 'పాడి పంటలు' సినిమా షూటింగ్ జరుగుతుండగా తండోపతండాలుగా జనం వచ్చారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోయేవాళ్లు. అప్పుడు కృష్ణగారు మమ్మల్ని మీరంతా సైలెంట్‌గా వుంటే మేము షూటింగ్ చేసుకుంటాం అన్నారు. ఆ మాటతో మేమంతా సైలెంట్ అయి షూటింగ్‌కి సహకరించాం. అప్పుడు నేను కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి అనే ఇన్స్పిరేషన్ కలిగింది. జంధ్యాలగారు, ఇ.వి.వి.గారి దగ్గర వర్క్ చేశాను. అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా వుండేవాళ్లం. ఇ.వి.వి.గారు డైరెక్షన్లో మా పార్టనర్స్ భగవాన్, పుల్లారావులతో కలిసి 'జంబలకిడి పంబ' సినిమా తీశాం. అలా నిర్మాతగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది''.
ఆభిమానుల ఎక్స్పెక్టేషన్స్కి మించి వుంటుంది!!
ఏ పొలిటికల్ పార్టీని కించపరిచే విధంగా వుండదు. రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు జరిగే కథలా మంచి మెసేజ్‌తో ఈ సినిమా వుంటుంది. మహేష్‌బాబుతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కొరటాల శివగారు కథ చెప్పారు. చాలా బాగుంది. ఈ కథతో సినిమా చేద్దాం అని చెప్పారు. మహేష్‌గారికి కూడా కథ బాగా నచ్చింది. వెంటనే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాం. దేవిశ్రీప్రసాద్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా 'వచ్చాడయ్యో సామి' పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కోసం కథ డిమాండ్ మేరకు రెండు ఫ్లోర్లలో అసెంబ్లీ సెట్‌ని భారీగా వేశాం. అలాగే టెంపుల్ సెట్ వేశాం. 'వచ్చాడయ్యో సామి' పాటని ఇక్కడే చిత్రీకరించాం. మిగతా పాటల్ని యూరప్‌లో చిత్రీకరించాం.
సినిమా అంతా రిచ్‌గా వుంటుంది. మహేష్‌ని యంగ్ సి.ఎంగా చాలా అందంగా చూపించారు. మేం చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాం. ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చుతుంది. టీజర్, ట్రైలర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అభిమానులు, ప్రేక్షకులు అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా ఈ సినిమా వుంటుంది. యంగ్ హీరోస్ అందరితో సినిమాలు చేశాను. మహేష్‌తో నేను చాలా చనువుగా క్లోజ్‌గా వుంటాను. ఆయన ఎర్లీ మార్నింగ్ షూటింగ్‌కి వచ్చినప్పుడు ఎలా వుంటారో.. ప్యాకప్ అయి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వుంటారు. ఎప్పుడూ సరదాగా జోక్‌లు వేస్తూ వుంటారు. మంచి మనసున్న హీరో మహేష్''.
'శ్రీమంతుడు' రికార్డ్‌ల్ని క్రాస్ చేస్తుంది!!
మహేష్‌బాబు, కొరటాల శివగారి కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' కంటే చాలా గొప్పగా ఈ చిత్రం వుంటుంది. మహేష్‌బాబుగారి రికార్డులన్నీ ఈ చిత్రం క్రాస్ చేస్తుంది. దేవిశ్రీప్రసాద్ నిన్ననే కాల్ చేసి 'మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూస్తున్నాను సార్' అని చెప్పాడు. పాటలు, ఆర్-ఆర్ ఎక్స్‌లెంట్‌గా చేశాడు దేవి. తిరు, రవి కె చంద్రన్ అద్భుతమైన ఫొటోగ్రఫీ చేశారు. సురేష్ ఫెంటాస్టిక్ సెట్స్ వేశారు. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. కియారా అద్వానీ ఫస్ట్‌టైమ్ తెలుగులో యాక్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మూవీ మా బేనర్లో చేస్తుంది''.
హ్యాట్సాఫ్ టు రాజమౌళి!!
ప్రస్తుతం మా బేనర్లో రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తీస్తున్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈనెల 21 నుండి మూడో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళిగారి దర్శకత్వంలో నిర్మించే భారీ మల్టీస్టారర్ చిత్రం ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. రాజమౌళిగారితో 2006 నుండి ఫాలో అవుతున్నాను. ఆయన ఇప్పటికి అవకాశం ఇచ్చారు. హ్యాట్సాఫ్ రాజమౌళి. ఆయనతో సినిమా చేసే అవకాశం కలిగినందుకు చాలా గర్వంగా వుంది''.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com