మూడు తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తున్న డి.వి.క్రియేషన్స్..!
Tuesday, November 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డి.వి.క్రియేషన్స్ డి. వెంకటేష్ మూడు క్రేజీ తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తమిళ చిత్రం కవలై వేడమ్. ఈ చిత్రాన్ని ఎంతవరకు ఈ ప్రేమ టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, గాయత్రి నటించిన పురియాధ పుధీర్ చిత్రాన్ని తెలుగులో పిజ్జా 2 టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రంజిత్ జేయకోడి తెరకెక్కించారు. డి.వి.క్రియేషన్స్ సంస్థ అందిస్తున్నమూడవ చిత్రం అందాల ప్రేయసి. ఈ చిత్రంలో వసంత రవి, ఆందేరి జేరేమై, అంజలి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ మూడు చిత్రాల రిలీజ్ డేట్స్ ను త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments