జగన్నాథమ్ వెనక్కి వెళుతున్నాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య, పరుగు చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్, దిల్‌రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం డిజె `దువ్వాడ జగన్నాథమ్`. హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై పదిమిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా సినిమా అమెరికా షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది.
ఈ సినిమాను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే బన్నికి స్కిన్ అలర్జీ రావడంతో షూటింగ్‌కు హాజరు కాలేకపోతున్నాడట. అందువల్ల షెడ్యూల్ ప్లానింగ్ ప్రకారం జరగడం లేదట. దీంతో యూనిట్ సినిమాను జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయంపై మరి యూనిట్ వర్గాలు ఎమని స్పందిస్తాయో చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com