దువ్వాడ సెట్స్ లో జగన్నాథమ్.
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం డిజె దువ్వాడ జగన్నాథమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఇక ఈరోజు నుంచి అల్లు అర్జున్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. సరైనోడు సినిమా సక్సెస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బన్ని ఈరోజు డిజె షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి వరకు జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ భారీ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments