దువ్వాడ సాంగ్ సెన్సేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్‌గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్. రీసెంట్ బ్లాక్ బస్టర్ సరైనోడు చిత్రంతో తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నబన్ని తెలుగులో చిత్ర సీమలోనే కాదు, మలయాళ సినీ పరిశ్రమలో కూడా తనదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 25వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రం జూన్ 23న విడుదల కానుంది.
గబ్బర్ సింగ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని సింగిల్ రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. శరణం భజే ..అంటూ వచ్చే ఈ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్‌ను దాటింది. ప్రస్తుతం 11 లక్షల 46వేలు వ్యూస్‌ను రాబట్టుకుంది సాంగ్. దేవిశ్రీప్రసాద్ కచ్చితంగా బన్ని సినిమా అంటేనే మంచి మ్యూజికల్ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com