అదర గొడుతున్న దువ్వాడ
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్‌గా జూన్ 23న సందడి చేయనున్నాడు. ఈలోపు యూనిట్ ప్రమోషన్ వర్క్స్‌లో బిజీగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటల్లో ఒక్కొక్క పాటను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అల్రెడి విడుదలైన శరణం భజే..సాంగ్ మిలియన్ వ్యూస్‌ను దాటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కాగా రీసెంట్‌గా విడుదల చేసిన గుడిలో మదిలో బడిలో.. అనే సాంగ్ బన్ని అభిమానులతో పాటు, సంగీతాభిమానులను ఊర్రుతలూగిస్తుంది.
అల్లు అర్జున్, పూజా హెగ్డే ఈ పాటలో స్టెప్స్ అదర గొట్టేశారు. అల్రెడి ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్స్‌లో ఒకడైన బన్నికి ధీటుగా పూజా హెగ్డే కాలు కదపడం విశేషం. ఈ చిన్నపాటి వీడియో బిట్ రెండు మిలియన్స్‌కు చేరువ కానుంది. ఇప్పటి వరకు బన్ని కనపడనటువంటి డిఫరెంట్ పాత్రలో ప్రజెంట్ చేస్తున్నాడు దర్శకుడు హీరీష్ శంకర్. దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందుతోన్న 25వ చిత్రమిది. సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేసిన తర్వాత ప్రీ రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com