దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కి హీరోయిన్ దొరికేసింది..!

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథమ్. ఈ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు.

అయితే...ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది అని ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేమ్ మెహ్రీన్ న‌టిస్తుంది అంటూ మ‌రో వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే...కాజ‌ల్, మోహ్రీన్ కాకుండా ముకుంద‌, ఒక లైలా కోసం చిత్రాల క‌థానాయిక పూజా హేగ్డేను సెలెక్ట్ చేసార‌ని స‌మాచారం..!