'డి.జె. దువ్వాడ జగన్నాథమ్'కు సెన్సార్ పూర్తి...
- IndiaGlitz, [Friday,June 16 2017]
'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'డి.జె..దువ్వాడ జగన్నాథమ్'. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ''డీజే మా సంస్థలో వస్తోన్న 25వ సినిమా. ఈ నెల 23న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నాం. ఓవర్సీస్లోనే 300 థియేటర్లలో విడుదల చేస్తున్నామంటే ఎంత ప్రతిష్టాత్మకంగా, భారీగా చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. నా కూతురు ఓసారి 'నాన్నా.. మన బ్యానర్లో 25వ సినిమా చాలా స్పెషల్‌గా ఉండాలి..అది బన్ని అన్నయ్యతో బావుంటుంది' తను అలా ఎందుందో తెలియదు కానీ బన్ని, హరీష్ కాంబినేషన్లో 25వ సినిమా చేయడం ఆనందంగా ఉంది. జూన్ 23న సినిమానే మాట్లాడుతుంది. దేవిశ్రీప్రసాద్ మా బ్యానర్లో చేస్తున్న ఏడో సినిమా. పూజా బన్ని పక్కన తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా పెర్ఫార్మెన్స్ చేసిందని అరవింద్‌గారు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. 23న సినిమా చూసి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుంది'' అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ''డీజే అంటే పబ్బులో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే అనే డైలాగ్‌తోనే ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఈ ఏంటో చెప్పవచ్చు. టీజర్స్, ట్రైలర్స్, పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ నెల 23న బ్రహ్మాండంగా విడుదల కానుంది. దిల్‌రాజుగారు, నేను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆయన బ్యానర్లో మూడోసారి నటిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వస్తోన్న 25వ సినిమా ఇది. చేస్తున్నాం. మా బ్యానర్ తర్వాత హోం బ్యానర్‌లా ఫీలయ్యే బ్యానర్ ఇది. ఎంతో మంది కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యానర్. అటువంటి బ్యానర్లో 25వ సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మా కాంబినేషన్లో వస్తున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ హ్యాట్రిక్ హిట్ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.
ఎస్.హరీష్ శంకర్ మాట్లాడుతూ '' బన్ని ఇందులో బ్రహ్మణ అబ్బాయి పాత్ర చేశాడు. క్యారెక్టర్ కోసం బన్ని పడ్డ కష్టం చూసి, బ్రహ్మణులందరూ తనను అక్కున చేర్చుకుంటారు. క్యారెక్టర్ చేస్తున్నంత సేపు నాన్‌వెజ్ కూడా మానేసారు. ఓ డైరెక్టర్‌ను మాగ్జిమమ్ పుష్ చేసి నా నుండే అన్ని రాబట్టుకున్నారు. అన్ని క్యారెక్టర్స్ సినిమాలో బావున్నాయి. సినిమాకు పూజా పెద్ద ప్లస్. క్లైమాక్స్‌లో ఫైట్ లేకుండా ఎంటర్టైనింగ్గా పూర్తి చేయడానికి బన్నిగారెంతో పుష్ ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి అభిమాని కాలర్ ఎగరేస్తాడు. అందుకు నాది పూచీ'' అన్నారు.