విజయ్ దేవరకొండ కోసం దుల్కర్ సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తన స్నేహితుడు ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ `డియర్ కామ్రేడ్` సినిమా పాట పాడాడట. దుల్కర్ హీరోగా నటిస్తూ అప్పుడప్పుడు తన సినిమా పాటలను కూడా పాడుతుంటాడు. ఏబీసీడీ, సి.ఐ.ఎ, చార్లి చిత్రాల్లో దుల్కర్ పాట పాడుకున్నాడు. ఈ మూడు చిత్రాలు దుల్కర్ కెరీర్‌లో హిట్ చిత్రాలుగా నిలిచాయి. కాగా ఇప్పుడు దుల్కర్ పాట పాడితే హిట్ అవుతుందనే తన సెంటిమెంట్ ప్రకారం విజయ్ దేవరకొండకు పాట పాడారు. అయితే దుల్కర్ పాడిన పాట మలయాళ వెర్షన్‌లోనట. జూలై 26న `డియర్ కామ్రేడ్` తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com