తెలుగు విడుదలకు సిద్ధమవుతోన్న దుల్కర్ సల్మాన్ , సాయిపల్లవి 'కలి'

  • IndiaGlitz, [Tuesday,August 01 2017]

ఓకే బంగారం సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన 'ఫిదా'తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి 'ఎంసిఎ' చిత్రంలో న‌టిస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా తెలుగులో విడుద‌ల కానుంది. దుల్క‌ర్ స‌ల్మాన్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్‌ చిత్రం 'క‌లి'. ఈ సినిమాను తెలుగు అనువాద హ‌క్కుల‌ను ప్ర‌ముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ డి.వి.కృష్ణ‌స్వామి ద‌క్కించుకున్నారు.

ప్రస్తుతం తెలుగు అనువదానికి సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆగ‌స్ట్ 2వ వారంలో ఈ సినిమా టైటిల్, లోగో విడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప‌లు ఉత్త‌మ చిత్రాల‌కు సంగీతం అందించి జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అవార్డ్స్ అందుకున్న గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.

More News

సౌత్ సినిమాలు బెస్ట్ : అక్షయ్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దక్షిణాది సినిమాల గురించి ప్రశంసల వర్షం కురిపించాడు.

రెహ్మాన్ 'వన్ హార్ట్'

ఇండియన్ మ్యూజిక్ కు వన్నె తెచ్చిన సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహ్మాన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.

సెప్టెంబర్ మొదటి వారంలో 'లచ్చి' గ్రాండ్ రిలీజ్

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రెక్షకులకి దగ్గరైన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి.

ఆగస్ట్ 2న మహేష్ 'స్పైడర్ ' ఫస్ట్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా

'పందెంకోడి2' కు ముహుర్తం కుదిరింది

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి.