తెలుగులో మరోసారి దుల్కర్...
Send us your feedback to audioarticles@vaarta.com
భాషతో సంబంధం లేకుండా మంచి స్క్రిప్ట్ ఉంటే చాలు.. సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఈ యువ కథానాయకుడు చేతి నిండా అవకాశాలతో బిజీగాఉన్నాడు. అయితే కూడా ఓ తెలుగు సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇంతకు ఆ సినిమాను తెరకెక్కించబోయే దర్శకుడెవరో తెలుసా!
మహి వి.రాఘవ్. తండ్రి మమ్ముట్టితో `యాత్ర` సినిమా చేసిన మహి రీసెంట్ టైంలో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌కు ఓ లైన్ వినిపించాడట. తనకు కూడా లైన్ నచ్చింది. పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పాడట. ఇప్పుడు మహి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంటున్నాడు. అంతా ఓకే అయితే `మహానటి` తర్వాత దుల్కర్ నటించే స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే అవుతుంది. పివిపి ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments