దుల్కర్ సల్మాన్ , సాయిపల్లవి 'హేయ్..పిల్లగాడ' లోగోను విడుదల చేసిన శేఖర్ కమ్ముల

  • IndiaGlitz, [Saturday,August 19 2017]

ఓకే బంగారం సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన 'ఫిదా'తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి 'ఎంసిఎ' చిత్రంలో న‌టిస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'క‌లి'. ఈ సినిమాను తెలుగులో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై 'హేయ్‌.. పిల్ల‌గాడ' అనే పేరుతో ప్ర‌ముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ డి.వి.కృష్ణ‌స్వామి విడుద‌ల చేస్తున్నారు. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా లోగోను ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా..

శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ - ''దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం క‌లి. ఈ చిత్రం మ‌ల‌యాళం, త‌మిళంలో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో హే పిల్ల‌గాడా! అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి స‌హా నిర్మాత‌కు అభినంద‌న‌లు'' అన్నారు.

ర‌చ‌యిత భాషా శ్రీ మాట్లాడుతూ - ''హే..పిల్ల‌గాడా సినిమా అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చాలా చ‌క్క‌గా వ‌చ్చింది. హేమ‌చంద్ర హీరో వాయిస్‌కు డ‌బ్బిగ్ చెప్పారు. శేఖ‌ర్ క‌మ్ముల‌గారు లోగో విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

శ్రీనివాస‌మూర్తి మాట్లాడుతూ - ''ఫిదా త‌ర్వాత సాయిప‌ల్ల‌వి న‌టించిన చిత్రం హేయ్..పిల్ల‌గాడ తెలుగులో విడుద‌ల‌వుతుంది. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ. త‌ప్ప‌కుండా సినిమా తెలుగు ఆడియెన్స్‌కు న‌చ్చుతుంది'' అన్నారు.

పాట‌ల ర‌చ‌యిత సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ - ''సెప్టెంబ‌ర్ 8న హేయ్‌..పిల్ల‌గాడ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో మంచి మెలోడి పాట రాయ‌డం ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సినిమా అవుతుంది. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి జోడి క్యూట్‌గా ఉంటుంది. మంచి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. కాస్తా యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది.

నిర్మాత డి.వి.కృష్ణ‌స్వామి మాట్లాడుతూ - '' ఓకే బంగారం దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఫిదా సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం హేయ్..పిల్ల‌గాడ‌. ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. సెప్టెంబ‌ర్ 8న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఈ సినిమాను ఫిదాలాగానే స‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.

More News

ఒకటి పవన్ డైరెక్టర్.. మరోకటి చిరు డైరెక్టర్..

మెగాబ్రదర్స్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా..తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నాడు యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్.

ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కి ఒకేలా..

తెలుగులో ఒకే టైంలో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన కాజల్ అగర్వాల్,సమంత..

నితిన్ కి అతనితో అస్సలు అచ్చి రావడం లేదు

అదేంటో గాని..కొన్ని కాంబినేషన్ లు ఎన్ని సార్లు కలిసి పనిచేసినా వర్కవుట్ కావు.

అనూప్ కి ఈ సారీ వర్కవుట్ అయ్యేలా ఉంది

దేవిశ్రీ ప్రసాద్,థమన్..ఇలా గట్టి పోటీ ఉన్నప్పటికీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు

కాజల్ కిదే తొలిసారి

డబుల్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో సినిమా చేయాలని ఎవరికి ఉండదు?