దుల్కర్ సల్మాన్ , సాయిపల్లవి 'హేయ్..పిల్లగాడ' లోగోను విడుదల చేసిన శేఖర్ కమ్ముల
Send us your feedback to audioarticles@vaarta.com
ఓకే బంగారం సినిమాతో దుల్కర్ సల్మాన్, ఇటీవల విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమతిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్‌లో నటిస్తున్నారు. సాయిపల్లవి `ఎంసిఎ` చిత్రంలో నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా `కలి`. ఈ సినిమాను తెలుగులో లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్ పతాకంపై `హేయ్.. పిల్లగాడ` అనే పేరుతో ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ డి.వి.కృష్ణస్వామి విడుదల చేస్తున్నారు. సమీర్ తాహిర్ దర్శకుడు. ఈ సినిమా లోగోను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు.
ఈ సందర్భంగా..
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ``దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం కలి. ఈ చిత్రం మలయాళం, తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో హే పిల్లగాడా! అనే పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగులో సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ దుల్కర్, సాయిపల్లవి సహా నిర్మాతకు అభినందనలు`` అన్నారు.
రచయిత భాషా శ్రీ మాట్లాడుతూ - ``హే..పిల్లగాడా సినిమా అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చాలా చక్కగా వచ్చింది. హేమచంద్ర హీరో వాయిస్‌కు డబ్బిగ్ చెప్పారు. శేఖర్ కమ్ములగారు లోగో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.
శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ - ``ఫిదా తర్వాత సాయిపల్లవి నటించిన చిత్రం హేయ్..పిల్లగాడ తెలుగులో విడుదలవుతుంది. డిఫరెంట్ లవ్ స్టోరీ. తప్పకుండా సినిమా తెలుగు ఆడియెన్స్‌కు నచ్చుతుంది`` అన్నారు.
పాటల రచయిత సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ - ``సెప్టెంబర్ 8న హేయ్..పిల్లగాడ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో మంచి మెలోడి పాట రాయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. దుల్కర్, సాయిపల్లవి జోడి క్యూట్‌గా ఉంటుంది. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. కాస్తా యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది.
నిర్మాత డి.వి.కృష్ణస్వామి మాట్లాడుతూ - `` ఓకే బంగారం దుల్కర్ సల్మాన్, ఫిదా సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం హేయ్..పిల్లగాడ. ఇదొక టిపికల్ లవ్‌స్టోరీ. సెప్టెంబర్ 8న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాను ఫిదాలాగానే సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి మాటలుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ, సంగీతంః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః గిరీష్ గంగాధరన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః దక్షిణ్ శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్ః వి.చంద్రశేఖర్, నిర్మాతః డి.వి.కృష్ణస్వామి, దర్శకత్వంః సమీర్ తాహిర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com