'డ్యూయెట్' షూటింగ్ పూర్తి....
Send us your feedback to audioarticles@vaarta.com
కాష్మోరా సక్సెస్ తర్వాత కార్తీ హీరోగా ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అదితిరావు హైదరీ హీరోయిన్గా రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ `డ్యూయెట్`( తమిళంలో కాట్రు వెలియిడు). ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్గా బెల్గ్రేడ్లో చిత్రీకరణతో షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్టయ్యాయి. ఈ సినిమాలో కార్తీ ఆర్మీ ఫైలట్లా నటిస్తున్నాడు. ఓకే బంగారం వంటి సక్సెస్ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న మరో లవ్ స్టోరి ఇది. సినిమా కోసం అభిమానులు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com