'డ్యూయెట్ ' ను పట్టేసుకున్నారు.....
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ `డ్యూయెట్`( తమిళంలో కాట్రు వెలియిడు). ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి. ఈ సినిమాను యు.ఎస్‌లో విడుదల చేసే హక్కులను అట్మస్ ఎంటర్టైన్మెంట్(ATMUS ENTERTAINMENT) సంస్థ చేజిక్కించుకుంది. తెలుగు, తమిళ వెర్షన్స్ యు.ఎస్‌లో ఈ సంస్థ ద్వారానే విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో కార్తీ ఆర్మీ ఆఫీసర్‌గా ఫైలట్ క్యారెక్టర్లో కనపడుతున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com