కొరటాల చిత్రంలో చిరు డ్యూయెల్ రోల్?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చిరు మరో సినిమాను లైన్‌లో పెట్టినట్టు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే..'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ను తెరకెక్కించిన కొరటాల శివ డైరెక్షన్‌లో చిరు తన తదుపరి చిత్రం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారనీ.. ఆ రెండు పాత్రలు కూడా ఎంతో వైవిధ్యమున్నవని చెబుతున్నారు. ఆ రెండు పాత్రల్లో ఒకటి చిన్న గ్రామంలో పొలం పనులు చూసుకునే పాత్ర కాగా.. మరొకటి ఎన్.ఆర్.ఐ. పాత్ర అనే కథనాలు వినిపిస్తున్నాయి.
చిరు కెరీర్‌లో డ్యూయల్ రోల్ పోషించిన సినిమాల్లో సింహభాగం సూపర్ హిట్స్‌గా నిలిచినవే. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. అసలే.. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఒక వైపు.. మాస్ హీరోల్లో నెంబర్ 1 అనిపించుకున్న హీరో మరో వైపు.. అలాంటి వీరి కలయికలో సినిమా అంటే అంచనాలకు ఆకాశమే హద్దు అని చెప్పాలి. 'సైరా' పూర్తయ్యేలోపే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments