మీడియా సర్కస్ వల్ల
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన సినిమా 'సూపర్ 30'కి సంబంధించి తన ట్విట్టర్ ద్వారా ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. "ఓ మీడియా వర్గం చేస్తున్న సర్కస్ వల్ల నేను మానసిక వేదనను అనుభవిస్తున్నాను.
విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా మంచి రిలీజ్ డేట్ చూసుకుని నా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలను కోరుతున్నాను. కొందరు పరోక్షంగా వేధిస్తుంటే మరికొందరు చప్పట్లు కొడుతున్నారు. సమాజం పై నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాల పై అవగాహన రావాలి. ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు ముగింపు పలకాలి" అంటూ హృతిక్ తన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
హృతిక్ 'సూపర్ 30'.. కంగనా 'మెంటల్ హై క్యా' సినిమాలు జూలై 16న విడుదలవుతాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హృతిక్ అభిమానులు కంగనా కావాలనే తన సినిమాను పోటీకి రిలీజ్ చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీనిపై కంగనా సోదరి రంగోలి హృతిక్‌పై ఘాటుగా స్పందించింది. రంగోలి వ్యాఖ్యలపై హృతిక్ ప్రెస్నోట విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com