10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్

  • IndiaGlitz, [Wednesday,May 12 2021]

తెలంగాణలో లాక్‌డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలు, కార్యాలయాలపై పడుతోంది. మరోవైపు దేవాలయాలు సైతం మరోసారి మూతబడ్డాయి. నిత్య కైంకర్యాలు మినహా దర్శనాలన్నీ రద్దు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్య కైంకర్యాలు సైతం ఏకాంతంగానే నిర్వహించనున్నారు. ఇక ఆర్టీసీ బస్సులు సైతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకే నడవనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ 30 శాతం సిబ్బందితోనే నడవనున్నాయి. ఈ క్రమంలోనే పది రోజుల పాటు పలు కార్యాలయాలు తమ సేవలను నిలిపివేస్తున్నాయి.

Also Read: లాక్‌డౌన్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా పది రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికి రీషెడ్యూల్‌ అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లకు రావొద్దని అధికారులు సూచించారు.

More News

ఏపీలో రంజాన్‌ పండుగ మార్గదర్శకాల విడుదల

విజయవాడ: కరోనా కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్‌ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

లాక్‌డౌన్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో లాక్‌డైన్ విధించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు.. ఇతర కీలక నిర్ణయాలివే..

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో అనివార్య పరిస్థితుల్లో మరోసారి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌కు మొగ్గు చూపింది.

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

లాక్‌డౌన్ ప్రకటన వచ్చిందో లేదో మందుబాబులు పెద్ద ఎత్తున వైన్ షాపులకు క్యూ కట్టారు. అయితే వీరికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ అంటే ఎలా?: హైకోర్టు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేటి మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమైంది.