10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్
- IndiaGlitz, [Wednesday,May 12 2021]
తెలంగాణలో లాక్డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలు, కార్యాలయాలపై పడుతోంది. మరోవైపు దేవాలయాలు సైతం మరోసారి మూతబడ్డాయి. నిత్య కైంకర్యాలు మినహా దర్శనాలన్నీ రద్దు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్య కైంకర్యాలు సైతం ఏకాంతంగానే నిర్వహించనున్నారు. ఇక ఆర్టీసీ బస్సులు సైతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకే నడవనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ 30 శాతం సిబ్బందితోనే నడవనున్నాయి. ఈ క్రమంలోనే పది రోజుల పాటు పలు కార్యాలయాలు తమ సేవలను నిలిపివేస్తున్నాయి.
Also Read: లాక్‌డౌన్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణలో 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా పది రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే స్లాట్‌బుక్ చేసుకున్నవారికి రీషెడ్యూల్ అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. లాక్డౌన్ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు రావొద్దని అధికారులు సూచించారు.