వ‌రుణ్ చిత్రంలో డ‌బ్ స్మాష్ న‌టి

  • IndiaGlitz, [Monday,April 01 2019]

ఈ సంక్రాంతికి 'ఎఫ్ 2'తో స‌క్సెస్ అందుకున్న హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు. త‌దుప‌రి చిత్రంలో వ‌రుణ్ 'వాల్మీకి' చేస్తున్నాడు. ఇది త‌మిళ చిత్రం 'జిగ‌ర్ తండా'కు రీమేక్‌.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌లో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఈ నెల‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. గ్యాంగ్ స్టర్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నాడు. కాగా త‌మిళ‌నాట డ‌బ్ స్మాష్ వీడియోల‌తో మృణాళిని ర‌వి పాపుల‌ర్ అయ్యారు.

ఈమె ఈ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళంలో ల‌క్ష్మీ మీన‌న్ చేసిన పాత్ర‌ను తెలుగులో మృణాళిని ర‌వి చేస్తున్నారు. త‌మిళంలో సిద్ధార్థ్ పాత్ర‌ను తెలుగులో త‌మిళ హీరో అధ‌ర్వ చేస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.